Delhi Blast: వెలుగులోకి మరో అనుమానిత కారు.. గాలింపు ముమ్మరం
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:10 PM
ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న జైష్ మాడ్యూల్ నుంచి పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం టెర్రర్ ఆపరేటివ్స్ అయిన డాక్టర్ ఉమర్, అమీర్‌లు ఢిల్లీ నుంచి మరో రెండు కార్లు సేకరించినట్టు బయటపడింది.
న్యూఢిల్లీ: ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో ముష్కరులు మరో కారును కూడా ఉపయోగించినట్టు నిఘా సంస్థలు కనిపెట్టాయి. వీరు ఉపయోగించినట్టు భావిస్తున్న ఎరుపురంగు ఎకోస్పోర్ట్ కారు కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.
ఈ కారు డాక్టర్ ఉమర్ పేరుతో రిజిస్టర్ అయిందని, కారు నెంబర్ DL 10CK 0458 అని నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు, బోర్టర్ చెక్‌పాయింట్లను పోలీసులు అప్రమత్తం చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న జైష్ మాడ్యూల్ నుంచి పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం టెర్రర్ ఆపరేటివ్స్ అయిన డాక్టర్ ఉమర్, అమీర్‌లు ఢిల్లీ నుంచి మరో రెండు కార్లు సేకరించినట్టు బయటపడింది. ఉగ్ర కుట్రలో ఈ కార్లను ఉపయోగించినట్టు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ పేలుడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ
ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. ఎలా జరిగిందో చూడండి.. సీసీటీవీ వీడియో వైరల్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి