Delhi Red Fort blast: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. ఎలా జరిగిందో చూడండి.. సీసీటీవీ వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:09 PM
ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మొత్తం 12 మంది మరణించారు (Delhi blast CCTV).
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో డజన్ల కొద్దీ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పేలుడుకు మూలంగా భావిస్తున్న i20 కారు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు పెద్ద విస్పోటనం జరిగింది. సోమవారం సాయంత్రం 6.50 గంటలకు ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు కారణమైన కారును డాక్టర్ ఉమర్ నబీ అనే వ్యక్తి నడుపుతున్నారు. అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె కలిగిన పేలుడు సమ్మేళనం, హ్యుందాయ్ i20లో ఉంచి తీసుకెళ్తున్నారు. దీనిని మాన్యువల్ డిటోనేటర్ ద్వారా పేల్చారు. ఈ పేలుడులో ఉమర్ నబీ కూడా చనిపోయినట్టు భావిస్తున్నారు (Red Fort explosion).
ఇది ఉగ్రవాద చర్యే అయినప్పటికీ పక్కగా ప్లాన్ చేసింది కాదని పోలీసులు, నిఘా వర్గాలు భావిస్తున్నాయి (explosion video). దీని కంటే పెద్ద బ్లాస్ట్‌ను ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు అధికారులు భావిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలతో నిందితులు జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. ఈ కార్ బ్లాస్ట్‌కు సంబంధించి గురుగ్రామ్ నుంచి ముగ్గురిని, ఫరీదాబాద్ నుంచి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..