Watch Video: భారీ పేలుడు.. ఇదీ అక్కడ పరిస్థితి..
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:10 PM
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో ఈ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. 10 మంది చనిపోగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుళ్లకు 10 మంది చనిపోగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. పలు వాహనాలకు మంటలు అంటుకోగా.. సమీపంలోని దుకాణాలు సైతం ధ్వంసం అయ్యాయి. ఘటనలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఏడు ఫైరింజన్ల సహాయంతో మంటలార్పుతున్నారు. ఈ పేలుడుకు ఘటనా స్థలంలో పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మీకోసం..
ఈ పేలుడుపై డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ మాట్లాడారు. ‘చాందిని చౌక్ మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు సంభవించిందని మాకు సమాచారం అందింది. వెంటనే స్పందించాను. 7 ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 7.29 కి మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో చాలా మంది చనిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంతా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు అందిస్తున్నారు.’ అని చెప్పారు.
సీఆర్‌పీఎఫ్ డీఐజీ కిషోర్ ప్రసాద్ పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేస్తు్న్నామని చెప్పారు.
కారు బ్లాస్ట్ ఘటనలో 8 మంది చనిపోయినట్లు లోక్ నాయక్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. ఒకరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
పేలుడు ఘటనపై ప్రత్యక్షి సాక్షి చెప్పిన వివరాలు కింద చూడొచ్చు..
పేలుడు సంభవించిన ప్రాంతంలోని దృశ్యాలు..
పేలుడు సంభవించిన పరిసరాల్లో భద్రతా దళాలు..
ఇంతటి భారీ శబ్ధం ఎప్పుడూ వినలేదు.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు కింద వీడియోలో చూడొచ్చు..
పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిన కార్లు, వస్తువులు..