KTR on Revanth: రేవంత్ అమి‌త్‌షా కాళ్లు పట్టుకున్నాడు.. కేటీఆర్

ABN, Publish Date - May 24 , 2025 | 12:56 PM

KTR comments on CM Revanth: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అయితే, దెయ్యం రేవంత్ అని బీఆర్‌ఎస్ ఛీప్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడీ అరెస్ట్ చేయకుండా కాపాడాలని ఢిల్లీలో సీఎం రేవంత్ అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.

KTR on CM Revanth Amit Shah Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారని బీఆర్‌ఎస్ ఛీప్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. రేవంత్ మాటలు, మూటల ముఖ్యమంత్రి అని.. పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని.. ఒకరు రాహుల్‌ గాంధీ.. మరొకరు మోదీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ (CM Revanth Reddy) పేరు ఉండటం తెలంగాణ సమాజానికే అవమానమన్నారు. ఈ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా కాపాడాలని రాత్రి చీకట్లో అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.

Updated at - May 24 , 2025 | 01:08 PM