Home » Amit Shah
భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్‌కు నీటి పంపకాన్ని నిలిపివేయనున్నది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌కు భారత్ కఠినంగా స్పందించింది
దేశ భద్రత నేపథ్యంలో పాకిస్థానీయులను వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్‌లోని 208 మంది పాకిస్థానీయులు ఈ నెలాఖరు వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశార
పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు, ప్రతిగా పాక్ విధించిన ఆంక్షల నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వారు రాష్ట్రపతికి వివరాలు అందించారు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌షా చెప్పారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులను కోబ్రా కమెండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారని, వారి నుంచి అధునాతన ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారని అమిత్‌షా తెలిపారు.
అంబేడ్కర్ ఏమైనా భగవంతుడా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన్ను కించపరిచాడు. అవును అంబేడ్కర్ ముమ్మాటికీ భగవంతుడే.
దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
అన్నాడీఎంకేకు ఎలాంటా షరతులు, డిమాండ్లు లేవని అమిత్‌షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.
మోదీ నాయకత్వంలో ఐక్యతా స్ఫూర్తి జమ్మూకశ్మీర్‌లో పరిఢవిల్లుతోందని అమిత్‌షా అన్నారు. హురియత్ మరో అనుబంధ సంస్థ జమ్మూకశ్మీర్ మాస్ మూవ్మెంట్ సైతం వేర్పాటువాదాన్ని ఖండించిందని, ఐక్య భారత్‌కు కట్టుబడి ఉంటామని ప్రకటించిందని తెలిపారు.