Delhi Explosion: ఢిల్లీ పేలుడుపై అమిత్‌షాకు మోదీ ఫోన్
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:04 PM
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేసి మాట్లాడారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు (Delhi Explosion) సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వెంటనే స్పందించారు. హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేసి మాట్లాడారు. పేలుడుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమిత్‌షా సైతం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్‌తో కూడా అమిత్‌షా మాట్లాడారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ వివరణ
పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీష్ గోల్చా మాట్లాడుతూ, సాయంత్రం 6.52 నెమ్మదిగా వెళ్తున్న ఒక వాహనాన్ని రెడ్ లైట్ వద్ద ఆపినప్పుడు ఆ వాహనంలోనే పేలుడు జరిగిందని చెప్పారు. పేలుడు కారణంగా సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయన్నారు. ఎఫ్ఎస్ఎల్, ఎన్ఐపీ సహా అన్ని ఏజెన్సీలు ఘటనా స్థలికి చేరుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరోకొందరు గాయపడ్డారని వివరణ ఇచ్చారు. పరిస్థితిని ఎప్పుడికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి అమిత్‌షా తమకు ఫోన్ చేసి వివరాలు అడిగారని, తాము ఎప్పటికప్పుడు సమాచారం ఆయనకు తెలియజేస్తున్నామని సతీష్ గోల్చా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..