Delhi Explosion: ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు.. అమిత్‌షా
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:52 PM
ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌చార్జితో మాట్లాడాననీ, వారిరువురూ ఘటనా స్థలి వద్ద ఉన్నారని అమిత్‌షా తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) వేగంగా స్పందించారు. ఈ ఘటనపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపనున్నట్టు చెప్పారు.
'సాయంత్రం 7 గంటలకు పేలుడు జరిగింది. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్స్ సిగ్నల్ వద్ద Hyundai i20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు పాదచారులు గాయపడగా, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పలువురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు జరిగిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైం బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్‌ఎస్‌జీ, ఎన్ఐఏ టీమ్‌లు, ఎఫ్ఎస్‌ఎల్ టీమ్‌లు కూలంకషంగా దర్యాప్తు జరుపుతున్నాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలించాలని ఆదేశాలిచ్చాం. ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌చార్జితో మాట్లాడాను. వారిరువురూ ఘటనా స్థలి వద్ద ఉన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతాం. ఆ వివారాలను పబ్లిక్‌కు తెలియజేస్తాం. ఆసుపత్రికి స్యయంగా వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకుంటాను' అని అమిత్‌షా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..