Amit Shah On Delhi Blast: పాతాళంలో దాక్కున్నా వేటాడతాం.. ఢిల్లీ పేలుడు ముష్కరులకు అమిత్‌షా వార్నింగ్
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:59 PM
ఫరీదాబాద్‌లోని సోమవారంనాడు జరిగిన నార్తర్న్ జోన్ కౌన్సిల్ (NZC) 32వ సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనతో ప్రమేయం ఉన్న ముష్కరులను పాతాళంలో దాగినా వెతికి పట్టుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) గట్టి వార్నింగ్ ఇచ్చారు. చేసిన నేరానికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఫరీదాబాద్‌లోని సోమవారంనాడు జరిగిన నార్తర్న్ జోన్ కౌన్సిల్ (NZC) 32వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
మరో కుట్రదారు అరెస్టు
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా క్వాజిగుండ్‌కు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ సోమవారంనాడు అరెస్టు చేసింది. నిందితుని జసిర్ బిలాల్ వానీ అలియాస్ డేనిష్‌గా గుర్తించింది. సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి వానీ సన్నిహితంగా ఉంటూ అతనికి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాడని, దాడి వ్యూహరచనలో కీలకంగా వ్యవహరించాడని ఎన్ఐఏ గుర్తించింది. ఢిల్లీలో పేలుడుకు ఘటనకు ముందు డ్రోన్లను మెరుగుపరచడం, రాకెట్ల తయారీకి అతను ప్రయత్నం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వానీని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకువచ్చారు.
నవంబర్ 10వ తేదీ సాయంత్రం లాల్‌ఖిలా మెట్రో స్టేషన్ సమీపంలో హ్యుండాయ్ ఐ20 కారులో శక్తివంతమైన పేలుడు సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి కేంద్రం అప్పగించింది.
ఇవి కూడా చదవండి..
నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. షేక్ హసీనా మరణశిక్షపై భారత్
ఆయుధ నిల్వల ఆరోపణలపై బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.