Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

ABN, Publish Date - Jul 22 , 2025 | 02:30 PM

వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ: వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో టీడీపీ, జనసేన ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ పార్టీ నేతలపై ఇష్టమొచ్చినట్టు కేసులు బనాయిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసులు పెట్టి దాడులు చేస్తే వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రోజా వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో మంత్రిగా కోట్లాది రూపాయలు దోచుకోవడం తప్ప.. రోజా ప్రజల కోసం చేసిందేమీ లేదని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తు్న్నారు.

Updated at - Jul 22 , 2025 | 02:31 PM