Home » Roja
ప్రజాప్రతినిధులపై వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె నోటి దురుసుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పు చేస్తే తప్పక శిక్షింపబడాలని, అది ఎవరైనా.. ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. వైసీపీ కౌన్సిలర్లపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు నేపథ్యంలో మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.
వైసీపీ నేత రోజా టిటిడి టికెట్ల వ్యాపారం వల్ల లాభపడినట్లు, ఇప్పుడు ఆ వ్యాపారం పోవడంతో ఆమె ఆగ్రహంగా మాట్లాడుతున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్య ఆరోపించారు
మాజీ మంత్రి రోజా నోటి దూల వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చారు.
‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పూర్తి అర్హులని కిరాక్ ఆర్పీ ప్రశంసించారు. రోజా టూరిజం మంత్రిగా పనిచేసిన గత రెండున్నరేళ్లలో వేల టిక్కెట్లను దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్పారని, విజిలెన్స్ శాఖకు కూడా ఆ విషయాన్ని అప్పగించారని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడుతున్నారని ఆమె ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది...
రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్‌లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.