YCP Roja: ప్రజాప్రతినిధులపై మరోసారి రెచ్చిపోయిన రోజా
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:39 PM
ప్రజాప్రతినిధులపై వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె నోటి దురుసుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

విజయవాడ: ప్రజాప్రతినిధులపై వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టి దాడులు చేస్తే తాము వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించ్చారు.
మా అధినేత జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. టీడీపీ నేతలు హైదరాబాద్ కాదు.. అమెరికాకు పారిపోతారని.. అవమానిస్తూ మాట్లాడారు. అయితే, ఆమె నోటి దురుసుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఏ మాత్రం గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని, సభ్యసమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, వైసీపీ హయాంలో మాజీ మంత్రి రోజా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమె త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని టీడీపీ కీలక నేతలు అంటున్నారు.
ఇవీ చదవండి..
సైట్ క్లియరెన్స్ కోసం ఏపీ దరఖాస్తు
ఏపీ, తెలంగాణలో తలసరి ఆదాయాల పెరుగుదల
For Telugu and Latest News