Share News

Fatal Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:36 AM

తెలంగాణలో వరుస ఘోర రోడ్డు ప్రమాదాలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Fatal Road Accident:  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Fatal Road Accident

జనగామ, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల (Fatal Road Accident) నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది వాహనదారులు మీతిమిరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు ఘటనల్లో వాహనదారులు మృతిచెందుతోండటంతో ఆయా కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనగామ జిల్లాలో ఇవాళ(ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


ఈ ఘటనలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి తెలంగాణ ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పులమాటి ఓం ప్రకాష్ S/O శంకరయ్య(75)దిండిగల్, నవదీప్ సింగ్ S/O ముంజిత్ సింగ్ బాలసముద్రం హన్మకొండక చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే, ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వసమైంది.


స్థానికులు వెంటనే జనగామ పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. రాజధాని బస్సు అత్యంత వేగంతో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాజధాని బస్సు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2025 | 08:36 AM