Share News

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:41 PM

BRS Leaders FIGHT: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు
BRS Leaders FIGHT

మహబూబాబాద్ : బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు పెట్టింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాన్ని తరలించే సన్నాహాక ప్రక్రియలో భాగంగా నేతల మధ్య ఐక్యత లోపించడంతో వివాదం రాజుకుంది. ఇంతకు ఆ నేతలేవరంటే.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు. రజతోత్సవ సభ జిల్లా సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌పై సొంత పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.


మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. సమన్వయ కర్తగా సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులను అందరిని కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా సూచించారు. నేతల్లో సఖ్యత కుదరడం లేదని.. కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపించారు. అందరినీ ఒకే తాటిపై నడిపించే సమర్థ నాయకత్వం కొరవడిందని ఆరోపణలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana Police: సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

Smita Sabharwal: ఆ రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా

Owaisi on Waqf Bill: వక్ఫ్‌ సవరణ చట్టంపై పోరాటం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 02:02 PM