Share News

Missing Workers Sigachi Factory: రోజులు గడుస్తున్నా లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:42 PM

Missing Workers Sigachi Factory: 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్‌ను డీఎన్‌ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు.

Missing Workers Sigachi Factory: రోజులు గడుస్తున్నా లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ
Missing Workers Sigachi Factory

సంగారెడ్డి, జులై 7: పాశమైలారం సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిగాచి పరిశ్రమలో పేలుడు (Pasamylaram Sigachi Explosion) ఘటన జరిగి ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎనిమిది మంది కార్మికుల (Missing Workers) ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ కార్మికుల కడసారి చూపు కూడా కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది రోజులు అవుతున్నా రాహుల్, రవి, వెంకటేష్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేష్, జస్టిన్, శివాజీల జాడ కనిపించని పరిస్థితి. వారి కోసం ఐలా సెంటర్ వద్ద కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపైనా దక్కుతుందేమోనని కుటుంబ సభ్యుల్లో ఆశ.


మరోవైపు ఆ 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్‌ను డీఎన్‌ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు. ఎనిమిది మంది ఆచూకీని గుర్తించడంలో డీఎన్‌ఏ రిపోర్టులు కీలకంగా మారనున్నాయి.


ఘటనా స్థలికి ఎన్‌డీఎమ్‌ఏ..

ఇక.. రేపు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం రానుంది. ఇందులో భాగంగా ఘటన స్థలాన్ని ఎన్‌డీఎమ్‌ఏ బృందం పరిశీలించనుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్‌డీఎమ్‌ఏతో కలిసి ఎన్‌డీఎమ్‌ఏ అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు ఇవ్వనుంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఎక్స్‌పర్ట్స్, హై లెవెల్ కమిటీలు పరిశీలించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

వారిపై దాడి చేశారో ఖబడ్దార్.. బీఆర్‌ఎస్‌కు రామచందర్ రావు వార్నింగ్

తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 01:42 PM