TG News: వరంగల్ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత
ABN , Publish Date - Jul 07 , 2025 | 10:04 AM
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో విద్యార్థి సంఘాల నేతలను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఇవాళ (సోమవారం) వరంగల్ జిల్లాలో (Warangal District) పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన వరంగల్‌కి గవర్నర్ బయలుదేరనున్నారు. ఉదయం 11గంటలకు NITని సందర్శించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో 23వ కాన్వకేషన్‌కి గవర్నర్ హాజరవనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లతో గవర్నర్ సమావేశం కానున్నారు. టీబీ నిర్మూలన యాక్షన్ ప్లాన్‌పై గవర్నర్ సమీక్ష చేయనున్నారు. అనంతరం 3:15 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బయలుదేరనున్నారు.
అయితే.. కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్ పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో నిన్న (ఆదివారం) అర్థరాత్రి పలువురు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. వారిని కాకతీయ యూనివర్సిటీలోని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడంతో వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
ఇంకా ఎన్ని రోజులు ఈ అర్ధరాత్రి అక్రమ అరెస్టులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గవర్నర్ వరంగల్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని చెప్పిన ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. కాన్వొకేషన్ యూనివర్సిటీకీ పండుగ లాంటిదని.. దానికి అందరం సహకరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రైవేంటివ్ అరెస్టులు చేయమని చెప్పిన పోలీసులు.. ఈ రోజు అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read Latest Telangana News And Telugu News