Share News

Transport Department: ఆటో కావాలా.. నమోదు చేసుకోండి!

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:18 AM

ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎలక్ర్టిక్‌ ఆటోల నమోదుకు రవాణా శాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని ఆటో డీలర్ల వద్ద అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

Transport Department: ఆటో కావాలా.. నమోదు చేసుకోండి!

  • ఓఆర్‌ఆర్‌లోపు నివసించే వారికి అవకాశం

హైదరాబాద్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎలక్ర్టిక్‌ ఆటోల నమోదుకు రవాణా శాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని ఆటో డీలర్ల వద్ద అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్రమోహన్‌ ఆదివారం డ్రైవర్లకు, డీలర్లకు పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. నగరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ క్రమంలోనే ఓఆర్‌ఆర్‌ లోపల ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎలక్ర్టిక్‌ ఆటోలకు అనుమతిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 263 జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ డీలర్‌ వద్దనైనా ఆటోలు కొనుగోలు చేయొచ్చని, డ్రైవింగ్‌ లైసెన్స్‌పై ఓఆర్‌ఆర్‌ లోపు నివసిస్తోన్న చిరునామా ఉండాలని పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 03:19 AM