Sigachi Industries Blast: సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ABN , Publish Date - Jul 07 , 2025 | 09:40 AM
Sigachi Industries Blast: సిగాచి పరిశ్రమలో లభించని ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. ఎనిమిది మంది కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

సంగారెడ్డి, జులై 7: పాశమైలారం సిగాచి పరిశ్రమలో (Sigachi Industries Blast) పేలుడు దుర్ఘటన జరిగి నేటికి ఎనిమిది రోజులు. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఐలా భవన్ వద్ద ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో 18 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
మొత్తం 14 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను డీఎన్‌ఏ రిపోర్టు కోసం అధికారులు ల్యాబ్‌కు పంపించారు. కాగా.. సిగాచి పరిశ్రమను సందర్శించిన హైలెవల్ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సభ్యులు గత శుక్రవారం ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయం, కార్మికులు ఎంత మంది ఉన్నారు, పేలుడు జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అలాగే పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరకు సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన కమిటీ సభ్యులు ఆ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
ఇవి కూడా చదవండి
డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..
కోరుట్ల చిన్నారిని చంపింది చిన్నమ్మేనా?
Read latest Telangana News And Telugu News