Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:44 AM
Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూమి రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాల్వల నిర్మాణం పూర్తవుతుందని.. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

సిద్దిపేట జిల్లా: భూ లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా భూ భారతి చట్టం తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 30 సంవత్సరాల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరుతో వచ్చిందని..దీంతో పంచాయతీలు, గొడవలు మొదలయ్యాయని అన్నారు. భూమి రక్షణం కోసం భూ భారతి చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురై అన్యాక్రాంతం అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ(గురువారం) సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో భూ భారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
గ్రామాల్లో భూముల పేరు మీద పంచాయతీలు ఉండద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సొంత కుటుంబాల్లోనే భూ పంచాయతీలు అవుతున్నాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని.. వాటిని అభివృద్ధికి వాడుకోవాలని సూచించారు. భూ భారతిలో గౌరవెల్లి , దేవాదుల ఏ ప్రాంతం కిందకు వస్తుందో స్పష్టంగా వివరాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
త్వరలోనే గౌరవెల్లి కాల్వల నిర్మాణం పూర్తవుతుందని.. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొంత మంది రైతులకు నష్టం జరిగిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ధరణి ద్వారా చాలామంది రైతులకు నష్టం జరిగిందని అన్నారు. అలాంటి తప్పు జరగవద్దనే భూ భారతి వచ్చిందని.. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. భూ శిస్తు ఉంటే తమ భూమి అనేది తెలుస్తుందని.. కొంతమంది రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. భూమిపై అవగాహన ఉన్నవారి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్
భూసమస్యలు పరిష్కరించేందుకే భూభారతి
MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి
Read Latest Telangana News And Telugu News