MP Raghunandan Rao: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే.. రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:41 PM
కేసీఆర్, కేటీఆర్, కవితలది ఇంటి సమస్య, పైసల పంచాయితీ, రాజకీయ వారసత్వ పంచాయితీ అని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెల్వదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.

సిద్దిపేట: తప్పుచేసిన వారు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కేసులు ఎదుర్కొవాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) అన్నారు. ఇవాళ(సోమవారం) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీహెచ్ఆర్ నగర్‌లో హాస్టల్ ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. విచారణ నిజాయితీగా జరగాలని కోరారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది అందరూ చెబుతున్న మాట అని చెప్పారు ఎంపీ రఘునందన్‌రావు.
కాళేశ్వరం అవినీతికి గత ముఖ్యమంత్రి కేసీఆర్, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, అధికారులు బాధ్యత వహించాలని, విచారణ త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. 18 నెలలుగా కాళేశ్వరం విచారణ కమిషన్ సమయాన్ని రేవంత్ ప్రభుత్వం రెండేసి నెలలుగా పెంచుకుంటూ పోవడంతో ప్రజల్లో కక్ష సాధింపు చర్యలనే అనుమానం కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని కనపడనీయకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్‌రావు.
కేసీఆర్, కేటీఆర్, కవితలది ఇంటి సమస్య, పైసల పంచాయితీ, రాజకీయ వారసత్వ పంచాయితీ అని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెల్వదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని.. పోటీ చేసే వారిని తప్పకుండా గెలిపించుకుంటామని ఉద్ఘాటించారు. కేంద్రమంత్రి వర్గంలో నూటికి 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు పోవాలని కోరారు. బీసీల పక్షాన బరాబర్ బీజేపీ ప్రశ్నిస్తోందని అన్నారు. బీసీ రిజర్వేషన్లు కోసం కోట్లాడుతామని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News