Share News

Horse Race Betting: హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌కు వాట్సాప్‌ గ్రూప్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 08:13 AM

వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో హార్స్‌ రేసింగ్‌పై బెట్టింగ్‌లను ఆహ్వానిస్తున్న ఓ బుకీతోపాటు ముగ్గురు పంటర్లను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2లక్షల నగదు, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Horse Race Betting: హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌కు వాట్సాప్‌ గ్రూప్‌
Horse Race Betting

బుకీ, ముగ్గురు పంటర్లు అరెస్ట్‌.. రూ. 2 లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో హార్స్‌ రేసింగ్‌పై బెట్టింగ్‌లను (Horse Race Betting) ఆహ్వానిస్తున్న ఓ బుకీతోపాటు ముగ్గురు పంటర్లను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2లక్షల నగదు, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన నగేష్‌(45)చెన్నైలో కొంతకాలం పనిచేశాడు. హార్స్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఇతను ఉద్యోగం పోవడం, కుటుంబ కారణాలతో నగరానికి వచ్చాడు. మలక్‌పేటకు చెందిన రాజేష్ కుమార్‌, విజయవాడకు చెందిన వెంకట్‌ చౌదరిలతో కలిసి హార్స్‌ రేస్‌ బెట్టింగ్‌లు నిర్వహించేవాడు.


తర్వాత కాలంలో పంటర్లను ఆకర్షించి, సొంతంగా బెట్టింగ్‌ నిర్వహించాడు. అంతేకాక ‘షైన్‌వెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ రూపొందించి, అందులో బెట్టింగ్‌లు స్వీకరించేవాడు. ఈ గ్రూపులో దేశ వ్యాప్తంగా 105 మంది పంటర్లు సభ్యులుగా ఉండగా, అందులో నగరానికి చెందిన వారు 20 మంది వరకు ఉన్నారు. వాట్సాప్‌ ద్వారా బెట్టింగ్‌లు తీసుకొని, ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించేవాడు. ఈ దందాపై పక్కా సమాచారమందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ, జవహర్‌నగర్‌ పోలీసులు కలిసి దాడి చేశారు. బుకీ నాగేష్‌తోపాటు, పంటర్లు మణికొండకు చెందిన బొర్రా వెంకట్‌ చౌదరి, కృష్ణానగర్‌కు చెందిన చల్లా రమే్‌షబాబు, సఫిల్‌గూడకు చెందిన సునీల్‌ను అరెస్ట్‌ చేశారు. నగేష్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.8.34 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో ఉన్న 2.47 లక్షలను సీజ్‌ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న సొత్తును జవహర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్‌ ఫోకస్‌

డ్రగ్స్‌ కేసుల్లో పబ్బులకు లింకులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 08:15 AM