Share News

Srushti case: సృష్టి కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:24 PM

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తాజాగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Srushti case: సృష్టి కేసులో మరో ముగ్గురు అరెస్ట్
Srushti Test Tube Baby Center case

హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో (Srushti Test Tube Baby Center case) తాజాగా ఇవాళ (శనివారం) ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. శిశువుల క్రయ విక్రయాల్లో నమ్రతకు ఏజెంట్లు సహకరించారని చెప్పారు. ఏజెంట్లకు డాక్టర్ నమ్రత భారీగా నజరానాలు ఇచ్చారని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇవాళ (శనివారం) సృష్టి కేసుకు సంబంధించిన కీలక విషయాలను మీడియాకు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.


భారీ నెట్‌వర్క్..

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో కూడా మహిళలే నమ్రతాకు ఏజెంట్లుగా ఉన్నారని వివరించారు. జిల్లాలో IVF కోసం ఫ్రీ క్యాంపుల నిర్వహించారని అన్నారు. క్యాంపులకు వచ్చిన దంపతులకు IVF ద్వారా పిల్లలు కలుగుతారంటూ డాక్టర్ నమ్రత నమ్మబలికారని తెలిపారు. అనంతరం తన వద్దకు వచ్చిన దంపతులను ఐవీఎఫ్ బదులు సరోగసీకి రెఫర్ చేశారని చెప్పారు. సరోగసీ కోసం దంపతుల నుంచి రూ. 30 నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని వెల్లడించారు. పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగించి డాక్టర్ నమ్రత మోసం చేశారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.


గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు..

మరోవైపు... సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రతా కస్టడీ విచారణలో అక్రమాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపుల నిర్వహించినట్లు హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తానని క్యాంపుల నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద మహిళలను డాక్టర్ నమ్రత గుర్తించినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి డాక్టర్ నమ్రతాకి సంబంధించిన ఏజెంట్స్ ట్రాప్‌లో పెడుతున్నారని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.


ఆ కేంద్రాల్లో డెలివరీలు..

ఆర్థికంగా ఆశచూపి పిల్లలను కన్నా తర్వాత డబ్బులు ఇస్తామని ఎరా వేసిందని... ఆ తర్వాత ప్లాన్ ప్రకారం డెలివరీ సమయానికి దగ్గరుండి విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డాక్టర్ నమ్రతా డెలివరీలు చేసిందని తెలిపారు. డెలివరీ అయిన తర్వాత నవజాత శిశువును తీసుకోని, తల్లికి డబ్బులు ఇస్తున్నారు డాక్టర్ నమ్రత బృందం. అలా నవజాత శిశువులను తీసుకొచ్చి చైల్డ్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నారు డాక్టర్ నమ్రత బ్యాచ్. సరోగసీ ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ బాధిత దంపతులకు ఇస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.


చైల్డ్ ట్రాఫికింగ్‌...

అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫామ్‌హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మియాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, యూసఫ్‌గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సృష్టి సెంటర్ కేసులో A3కల్యాణి, A6 సంతోషిలా విచారణ కీలకంగా మారనుంది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్‌కి డాక్టర్ నమ్రత పాల్పడ్డారు. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఈ విచారణలో డాక్టర్ నమ్రత ఇంతవరకు నోరు మెదపలేదు. నమ్రతా బాటలోనే A3 కల్యాణి, A6 సంతోషిలు ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 05:58 PM