TG Police: ఒడిశా బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:42 AM
ఒడిశాలో కిడ్నాప్‌కు గురై.. బాచుపల్లి ప్రాంతంలో బంధించి ఉన్న బాలికను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెర నుంచి విడిపించారు. ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా సాహిర గ్రామానికి చెందిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచుపల్లి ప్రాంతంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో నిర్బంధించారు.

మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కేసు ఛేదన
సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు
నిజాంపేట్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి: ఒడిశాలో కిడ్నాప్‌కు గురై.. బాచుపల్లి ప్రాంతంలో బంధించి ఉన్న బాలికను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెర నుంచి విడిపించారు. బాచుపల్లి సీఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం... ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా సాహిర గ్రామానికి చెందిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచుపల్లి ప్రాంతంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో నిర్బంధించారు. ఈ విషయమై శనివారం రాత్రి ఒడిశా కటక్ ప్రాంతంలో ఉన్న సౌత్ ఏసియా ఉమెన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అధికారి తన్విసింగ్ .. బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు కేసును సవాల్‌గా తీసుకున్నారు. అయితే బాలిక తన వద్ద ఉన్న మొబైల్ ద్వారా ఫొటో పంపి, లొకేషన్ వివరాలు తల్లిదండ్రులకు తెలిపింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందనే వివరాలు దర్యాప్తులో వెలుగుచూశాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఒక ఇంట్లో బంధించి ఉన్న బాలికను రక్షించారు. అనంతరం సూరారంలోని సఖీ సెంటర్‌కు తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు, ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడికి చేరుకున్న కుటుంబీకులకు మైనర్‌ను అప్పగించారు. కిడ్నాప్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News