WhatsApp Grievance: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వాట్సాప్ గ్రీవెన్స్
ABN , Publish Date - Jul 28 , 2025 | 10:36 AM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రీవెన్స్‌ను సోమవారం నుంచి హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఓ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రీవెన్స్‌ను (WhatsApp Grievance) ఇవాళ(సోమవారం జులై 28) నుంచి హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన (Hyderabad Collector Harichandana) ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజావాణికి రాలేని వారు ఈ 7416687878 నెంబర్‌కి వాట్సాప్‌లో ఫిర్యాదులు చేయొచ్చని కలెక్టర్ తెలిపారు.
ప్రతీ వాట్సాప్ కంప్లెయింట్‌ను పరిశీలించి యూనిక్ ఐడీ ఇచ్చి, వాట్సాప్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ పంపుతామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కరానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదులని కేటాయిస్తామని కలెక్టర్ చెప్పుకొచ్చారు. ప్రజావాణికి రాలేని ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులకు వాట్సాప్ గ్రీవెన్స్ ఫెసిలిటీ ఉపయోగంగా ఉంటుందని వివరించారు. సిటిజన్ ఫ్రెండ్లీ గవర్నెన్స్‌లో భాగంగా ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చామని కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జీవితాంతం గ్రీన్ చాలెంజ్ కొనసాగిస్తా: సంతోష్
బీటెక్ బయో టెక్నాలజీలో మరిన్ని సీట్లకు అనుమతి
Read latest Telangana News And Telugu News