Telangana Govt: తెలంగాణలో కొలువుల జాతర.. రేవంత్ ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:41 AM
Ponnam Prabhakar: తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్: ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడదల చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని.. వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను.. జాబ్ క్యాలండర్ ప్రకారం విడుదల చేయనున్నామని ప్రకటించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలివే..
ఆర్టీసీలో మొత్తం 3038 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. వాటిలో..
డ్రైవర్ -2000
శ్రామిక్ -743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) - 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) - 114
డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ - 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ - 18
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) -11
అకౌంట్ ఆఫీసర్స్ - 6
మెడికల్ ఆఫీసర్స్ జనరల్ - 7
మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ - 7
ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana Police: సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Smita Sabharwal: ఆ రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా
Owaisi on Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై పోరాటం
Read Latest Telangana News And Telugu News