Share News

CM Revanth Reddy: పీవీ నరసింహారావు దేశ ప్ర‌గ‌తిని పరుగులు పెట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:12 PM

పీవీ నరసింహారావు స్పూర్తితోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.

CM Revanth Reddy: పీవీ నరసింహారావు  దేశ  ప్ర‌గ‌తిని పరుగులు పెట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి సందర్భంగా ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్మరించుకున్నారు. ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలోనూ, అన్ని రంగాల్లో ఆర్థిక సంస్కరణలతో దేశ ప్ర‌గ‌తిని పరుగులు పెట్టించిన ఘ‌నత పీవీ న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.


నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. విద్యా వ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశ పెట్టారని, నవోదయ విద్యాలయాలు పీవీ హయాంలోనే ఏర్పాటు చేశారని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారని ఉద్ఘాటించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


పీవీ స్పూర్తితోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు, ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం సంకల్పించిందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఫోన్ ట్యాపింగ్.. రోజుకొకరి విచారణ.. ఇదేమన్న డైలీ సీరియలా: ఎంపీ రఘునందన్

బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని సీఎం రేవంత్.. హరీష్ ఎద్దేవా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 09:02 PM