Share News

Minister Thummala Nageswara Rao: రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:24 PM

పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.

Minister Thummala Nageswara Rao: రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు: మంత్రి తుమ్మల
Minister Thummala Nageswara Rao

హైదరాబాద్, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు ఉందని మండిపడ్డారు. ఇవాళ(శుక్రవారం) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో సెంట్రల్ డ్రాఫ్ట్ సీడ్స్ బిల్లు-2025 రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి తుమ్మల.


విత్తన ముసాయిదా బిల్లుపై సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలను నియంత్రించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోతే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విత్తన ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.


జిల్లాల వారీగా రైతు సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులు అభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశించారు. పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 12:29 PM