Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు... కేసీఆర్ ఓఎస్డీని విచారించిన అధికారులు
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:00 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు.
హైదరాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ఇవాళ(గురువారం) విచారణ చేశారు. రెండు గంటల పాటు విచారణ జరిపి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధ కిషన్ రావు స్టేట్‌మెంట్‌లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్‌లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో రాధ కిషన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు సిట్ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..
Read Latest Telangana News And Telugu News