Share News

Minister Seethakka: పెన్షన్‌ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jul 24 , 2025 | 08:10 PM

నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేద వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో పెన్షన్ ఆలస్యం అయితే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు.

Minister Seethakka: పెన్షన్‌ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: మంత్రి సీతక్క
Minister Seethakka

హైదరాబాద్: పెన్షన్‌ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని మంత్రి సీతక్క (Minister Seethakka) వ్యాఖ్యానించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా పింఛన్ అందించేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. పెన్షన్లు అందించడం సామాజిక బాధ్యతని మంత్రి ఉద్ఘాటించారు. చేయూత పెన్షన్ల పంపిణీపై ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క ఇవాళ(గురువారం జులై24) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూకి సెర్ప్ సీఈవో దివ్య, దేవరాజన్, డైరెక్టర్ గోపీ, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా క్యాంటీన్‌లు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి సీతక్క.


15 సంవత్సరాల వయస్సు నుంచే మహిళా సంఘాల్లో సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందని ఉద్ఘాటించారు. ఆర్టీసీలో 200 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగాయంటే.. మహిళలకు ఫ్రీ బస్సు బాగా ఉపయోగపడుతోందని స్పష్టం చేశారు. మహిళలు ఫ్రీ బస్ ఎక్కడమే కాదని.. వారిని ఆ బస్సులకు ఓనర్లను చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయన్నారు మంత్రి సీతక్క.


నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు ఆలస్యమయితే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అర్హులకే పింఛన్లు అందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రతీ నెల రూ.1000 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షనే చేయూతని.. అదే వారి ధైర్యమని ఉద్ఘాటించారు. ఈ క్రెడిట్ అంతా ఐఏఎస్ దివ్యకే దక్కుతుందని... అలాగే ప్రతీ అధికారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు పెన్షనర్ల కష్ట సుఖాలు తెలుసుకోవాలని.. మానవ సేవే మాధవ సేవని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 09:00 PM