IPS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:22 PM
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 32 మంది అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.
హైదరాబాద్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS Officers Transfers) అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగులు లభించగా.. మరికొంతమంది బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు వీరే...
1. దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డీజీపీ.. మల్టిజోన్–II నుంచి డీజీపీ ఆఫీస్ (పర్సనల్)కు బదిలీ.
2. పరిమల హనా నూతన్ జాకబ్ జాయింట్ కమిషనర్.. హైదరాబాద్ సిటీ నుంచి సీఐడీ డిప్యూటీ ఐజీగా బదిలీ.
3. చేతన మైలబత్తుల.. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ RBVRR TGPA
4. నారాయణరెడ్డి.. వికారాబాద్ ఎస్పీ నుంచి మహేశ్వరం జోన్‌కు డీసీపీగా బదిలీ.
5. పద్మజ.. డీసీపీ మల్కాజిగిరి నుంచి ఎస్పీ (అడ్మిన్), యాంటీ నార్కొటిక్స్ బ్యూరో.
6. పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్రావ్.. ఎస్పీ సీఐడీ నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీగా బదిలీ.
7. ఖరే కిరణ ప్రభాకర్.. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ నుంచి హైదరాబాద్ డీసీపీ సౌత్ జోన్‌కు బదిలీ.
8. చెన్నూరి రూపేశ్.. ఎస్పీ టీజీ (SP TG) యాంటీ నార్కోటిక్ నుంచి డీసీపీ SM&IT, హైదరాబాద్‌కు బదిలీ.
9. శబరీశ్, ఎస్పీ ములుగు నుంచి మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ.
10. నితికా పంత్.. కమాండెంట్ రెండో బెటాలియన్ నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా బదిలీ.
11. గిరిధర్.. వనపర్తి ఎస్పీ నుంచి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఎస్పీ టీజీ (SP TG)గా బదిలీ.
12. స్నేహా మెహ్రా.. డీసీపీ సౌత్ జోన్ నుంచి వికారాబాద్ ఎస్పీగా బదిలీ.
13. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్
14. కేకన్ సుధీర్ రామనాథ్.. ములుగు ఎస్పీగా నియామకం.
15. సిరిసెట్టి సంకీర్త్.. గవర్నర్ ఏడీసీ(ADC) నుంచి జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ.
16. పాటిల్ కాంతిలాల్ సుభాశ్.. గవర్నర్ ఏడీసీ(ADC)గా నియామకం.
17. బి.రామ్ రెడ్డి.. ఎస్పీ సీఐడీ (SP CID) నుంచి పెద్దపల్లి డీసీపీగా బదిలీ.
18. సి.శ్రీధర్.. ఎస్పీ ఇంటెలిజెన్స్ నుంచి మల్కాజిగిరి డీసీపీగా బదిలీ.
19. అవినాశ్ కుమార్.. SDPO నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు అడిషనల్ ఎస్పీ(Addl. SP)గా బదిలీ.
20. కాజల్.. SDPO నుంచి ఆదిలాబాద్‌కు అడిషనల్ ఎస్పీ(Addl. SP)గా బదిలీ.
21. కంకనాల రాహుల్ రెడ్డి.. SDPO నుంచి భువనగిరి అడిషనల్ ఎస్పీ(Addl. SP)గా బదిలీ.
22. శేషాద్రిని సురుకొంటి.. SDPO నుంచి రాజన్నసిరిసిల్లాకు అడిషనల్ ఎస్పీ(Addl. SP)గా బదిలీ.
23. శివం ఉపాధ్యాయ.. SDPO నుంచి ములుగు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) (Addl. SP)గా బదిలీ.
24. భైంసా SDPOగా రాజేశ్ మీనా.
25. మౌనికా.. ASP నుంచి ఆదిలాబాద్‌కు అడిషనల్ ఎస్పీ అడ్మిషన్‌గా (Addl. SP Admn)గా బదిలీ.
26. మనన్ భట్.. ఏఎస్పీ (ASP) గ్రేహౌండ్స్ నుంచి ఏటూరునాగారం ఏఎస్పీ(ASP)గా బదిలీ.
27. పతిపాక సాయి కిరణ్.. ఏఎస్పీ (ASP) గ్రేహౌండ్స్ నుంచి నిర్మల్‌కు ఏఎస్పీ (ASP)గా బదిలీ.
28. రుత్విక సాయి కొట్టే.. ఏఎస్పీ (ASP) గ్రేహౌండ్స్ నుంచి వేములవాడ ఏఎస్పీ(ASP)గా బదిలీ.
29. యాదవ వసుందర ఫౌరెబి.. ఏఎస్పీ (ASP) నుంచి సతుపల్లి, ఖమ్మంకు ఏఎస్పీ(ASP)గా బదిలీ.
30. ఎస్.శ్రీనివాస్.. వెయిటింగ్ లిస్ట్(waiting list) నుంచి ఎస్పీటీజీ ట్రాన్స్‌కో (SP TG TRANSCO)లో నియామకం.
31. డి.సునీత.. వెయిటింగ్ లిస్ట్(waiting list) నుంచి వనపర్తి ఎస్పీ(SP)గా బదిలీ.
32. కె.గుణశేఖర్.. వెయిటింగ్ లిస్ట్(waiting list) నుంచి రాచకొండ డీసీపీ క్రైమ్స్‌కు బదిలీ.
ఈ వార్తలు కూడా చదవండి..
భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు
బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ సిట్ దూకుడు.. విచారణకు హాజరైన హీరోయిన్లు
Read Latest Telangana News And Telugu News