Share News

Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు

ABN , Publish Date - Nov 22 , 2025 | 09:01 AM

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డిజిపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోనున్నారు. వీరిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా ఉన్నట్లు సమాచారం.

Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
Maoists

హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు (Maoists) పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరికొంత మంది మావోయిస్టులు అడవిబాట వదిలి.. జనజీవనస్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. చేతులకు తుపాకీ వదిలి.. దేశాభివృద్ధిలో చేతులు కలపనున్నారు. తాజాగా మరో 37 మంది మావోయిస్టులు ఇవాళ (శనివారం) లొంగిపోనున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోతున్నామని ప్రకటన విడుదల చేశారు.


పార్టీ ముఖ్య లీడర్లే..!

వీరిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా ఉన్నట్లు సమాచారం. లొంగిపోనున్న వారిలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. జనజీవనస్రవంతిలో కలిసేందుకు వచ్చిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు డీజీపీ.


ఈ వార్తలు కూడా చదవండి

ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు

పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ ఉప్పల సతీష్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 22 , 2025 | 09:18 AM