Mahesh Kumar Goud: తెలంగాణలో పూర్తి స్థాయిలో టీపీసీసీ ప్రక్షాళన
ABN , Publish Date - Apr 23 , 2025 | 02:24 PM
Mahesh Kumar Goud: టీపీసీసీ ప్రక్షాళనపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో జరుగుతున్న జై బాపు, జై భీమ్ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు ఉంటుందని చెప్పారు. గాంధీభవన్‌లో ఇవాళ(బుధవారం) తెలంగాణ రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
పరిశీలకులకు మూడు దశల్లో టాస్క్ నిర్దేశించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులను ఆహ్వానించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలనిమహేష్ కుమార్ గౌడ్ సూచించారు. టాస్క్ -2లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్, టాస్క్-3లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కో ఆర్డినేటర్లు ఇచ్చిన బాధ్యతలను మంచిగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో జరుగుతున్న జై బాపు, జై భీమ్ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలి: మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉందని.. బ్రిటిష్ వాళ్లతో కూడా పోరాటం చేసిందని ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. విస్తృత భావజాలం ఉన్న పార్టీ అని.. జాతీయ స్థాయి ఆలోచనలతో కాంగ్రెస్ పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ గాంధీ సిద్ధాంతాలతో నడుస్తుందని తెలిపారు. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలని సూచించారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్‌గా పని చేయాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు.
ప్రస్తుతం గుజరాత్ మోడల్‌గా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు విస్తారంగా జనంలోకి పోవాలని సూచించారు. సిద్ధాంత పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కులగణన 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మకమని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ ప్రభుత్వం చేపట్టిందని ఉద్ఘాటించారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీనాక్షి నటరాజన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Election: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
TGSRTC: ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Osmania University: ఆర్ట్స్ కాలేజీకి ట్రేడ్ మార్క్ గుర్తింపు
Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు
Read Latest Telangana News And Telugu News