Share News

TG News: హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు

ABN , Publish Date - Jul 11 , 2025 | 10:00 AM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

TG News: హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు
Kukatpally Fake Liquor Case

హైదరాబాద్‌: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై (Kukatpally Fake Liquor Case) మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మెుత్తం బాధితుల సంఖ్య 51 కాగా.. గాంధీ ఆస్పత్రిలో 14మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అలాగే నిమ్స్‌లో 34 మంది కల్తీ కల్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. నిమ్స్‌లో ఆరుగురికి వైద్యులు డయాలసిస్‌ చేస్తున్నారు. ఈఎస్ఐలో ఒకరు, ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరొకరికి చికిత్స కొనసాగుతోంది. కాగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గంగారాం(70) అనే వ్యక్తి మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.


అయితే, కల్తీ కల్లు ఘటనలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ఉన్నారు. మరోవైపు బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఐదు కేసులు నమోదు చేశారు. కూకట్‌పల్లి, KPHB పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి.


ఐదు కల్లు కాంపౌండ్‌ల నుంచి అధికారులు శాంపిల్స్‌ సేకరించారు. వాటిని నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి బాధితులను పరామర్శించారు. ఎప్పటికప్పుడు అధికారులని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, తమకు వెంటనే సమాచారం అందజేయాలని ఆదేశించారు మంత్రులు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 11 , 2025 | 03:01 PM