KTR On Bhadradri Temple: భద్రాద్రి రామయ్య భూముల కబ్జాపై కేటీఆర్ రియాక్షన్
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:51 AM
భద్రాచలం రామచంద్రస్వామి దేవస్థానం భూములు కబ్జా అయ్యాయని, అయినా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీలో పొత్తులో ఉన్నారని మౌనంగా ఉండిపోయారా? అంటూ విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్, జులై 11: భద్రాచలం రామచంద్రస్వామి దేవస్థానం భూముల వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) స్పందించారు. భద్రాద్రి రామయ్య భూములు కబ్జా అయితే బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు (Telangana BJP Chief Ramachandar Rao) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా అయినా బీజేపీ నుంచి ఒక్క మాటా లేదని మండిపడ్డారు. ఈ అంశంలో మాట్లాడడానికి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుకు సమయం లేదా.. లేక కేవలం రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే మౌనంగా ఉంటున్నారా? అంటూ నిలదీశారు. రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచలం దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. దేవస్థానం భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్..
బీజేపీ రామచంద్రా నోరు తెరవరేం?. రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే మాటైనా మాట్లాడరేం?. మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా?. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మోడీతో మాట్లాడతారో, మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం. భద్రాద్రిని కాపాడండి.. ఆక్రమణల చెర నుంచి విడిపించండి’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
టీటీడీలో ఆ ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.. బండి సంజయ్ డిమాండ్
అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..
Read Latest Telangana News And Telugu News