Golkonda Bonalu: గోల్కొండ కోటలో అమ్మకు 5వ బోనం..
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:32 AM
శివసత్తులు, పోతరాజు నృత్యాలు, తొట్టెల ఉరేగింపుతో తెలంగాణ(Telangana)లో బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం అషాఢమాసం సందర్భంగా గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి 5వ బోనం సమర్పించారు.

హైదరాబాద్: శివసత్తులు, పోతరాజు నృత్యాలు, తొట్టెల ఉరేగింపుతో తెలంగాణ(Telangana)లో బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం అషాఢమాసం సందర్భంగా గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి 5వ బోనం సమర్పించారు. ఆలయ చైర్మన్ చంటిబాబు, కమిటీ సభ్యుల అధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు.
జస్టిస్ బి.ఎస్.జగ్జీవన్‌కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు జస్టిస్ బి.ఎస్.జగజ్జీవన్ కుమార్‌ను శాలువాతో సత్కరించారు. వేల సంఖ్యలో భక్తులు కోటకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని బోనాలను, తొట్టెలను సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
జలమండలి అధికారులు మంచినీటి వసతిని ఏర్పాటు చేయగా, కోటు చుట్టూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఈవో చిదెళ్ల వసంత, ఆలయ పూజారి సర్వేశ్, ఆకుల చంద్రశేఖర్, జి.సంతోష్‌గౌడ్, జలమండలి అధికారులు రాజేశ్, రమేశ్, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News