Share News

GHMC: జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు..

ABN , Publish Date - Jul 11 , 2025 | 10:03 AM

జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే అంశంపై స్టాండింగ్‌ కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. యూట్యూబ్‌ చానళ్లు, డిజిటల్‌ పేపర్ల జర్నలిస్టులమని కార్యాలయానికి వస్తోన్న కొందరు అధికారుల విధినిర్వహణకు భంగం కలిగించడంతో పాటు.. బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తున్నారని పలువురు సభ్యులు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.

GHMC: జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు..

- స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సూత్రపాయ నిర్ణయం

- త్వరలో అధికారిక ఉత్తర్వులు?

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయాల్లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే అంశంపై స్టాండింగ్‌ కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. యూట్యూబ్‌ చానళ్లు, డిజిటల్‌ పేపర్ల జర్నలిస్టులమని కార్యాలయానికి వస్తోన్న కొందరు అధికారుల విధినిర్వహణకు భంగం కలిగించడంతో పాటు.. బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తున్నారని పలువురు సభ్యులు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.


కొన్ని సర్కిళ్లలో పట్టణ ప్రణాళికా విభాగం చైన్‌మెన్లు, పాత్రికేయులమని చెప్పుకుంటోన్న వారు కలిసి భవన నిర్మాణదారులను వేధిస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయాల్లో జరిగిన విషయాలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో అక్రిడిటేషన్‌ ఉన్న వారిని వారానికి ఒకసారి అనుమతించాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు ఓ సభ్యుడు తెలిపారు.


city7.2.gif

ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశ ముందని తెలిసింది. కాగా, దీనిని కేంద్ర, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు తెలిసింది. ఇబ్బందులు పెట్టే మీడియా సంస్థల ప్రతినిధుల విషయంలో చర్యలు తీసుకోకుండా మొత్తం మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించాలనే ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 10:03 AM