Congress Vs BRS: బావ బామ్మర్దులది పనికిమాలిన ఏడుపు.. కేటీఆర్, హరీష్‌పై జగ్గారెడ్డి ఫైర్
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:59 PM
Congress Vs BRS: సెక్రటేరియట్ కట్టడానికే ఒక టర్మ్ అంత వాడుకున్నారంటూ బీఆర్‌ఎస్‌పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు.

హైదరాబాద్, జులై 18: చంద్రబాబు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని.. తెలంగాణ హక్కుల కోసమే సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Leader Jaggareddy) తెలిపారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ది ఫాం హౌజ్ పరిపాలన, రేవంత్ రెడ్డిది ప్రజాపరిపాలన అని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల అంశాలపై ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించడంలో తప్పేముందని అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు కళ్ళు దొబ్బినయా అంటూ మండిపడ్డారు. బావ బామ్మర్దులది పనికిమాలిన ఏడుపు అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. ‘మీరు ఫాం హౌజ్‌లో పడుకున్నారని, మమ్మల్ని కూడా ఫాం హౌజ్‌లోనే పడుకోమంటారా?’ అంటూ జగ్గారెడ్డి దుయ్యబట్టారు.
కేటీఆర్‌కు అన్నీ స్ట్రోక్‌లే..
సెక్రటేరియట్ కట్టడానికే ఒక టర్మ్ అంత వాడుకున్నారంటూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ పర్మినెంట్‌గా ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. పదేండ్లు రాజభోగాలు అనుభవించి పదవి పోయే సరికి షాక్‌లో ఉన్నారంటూ సెటైర్ విసిరారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారా అని ప్రశ్నించారు. బట్ట కాల్చి సీఎంపై మంత్రులపై వేస్తానంటే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు పదవి పోయాక పదవిలేదనే స్ట్రోక్, ఒకవైపు చెల్లెలి స్ట్రోక్, మరోవైపు బామ్మర్ది స్ట్రోక్ వచ్చిందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు.
హరీష్, కేటీఆర్‌లపై సెటైర్స్
రాష్ట్రం వచ్చిన తర్వాత జై తెలంగాణ అనడం ఎందుకు అని ప్రశ్నించారు. పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తీసేసిన వాళ్లు తెలంగాణ కోసం అడిగే అర్హత ఎక్కడిదని నిలదీశారు. పార్టీ పేరులో టీ ఎందుకు తీశారు? బీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదం తీసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలన్నారు. ‘హరీష్ రావు ఎక్కడ పడుకుంటే మాకెందుకు? ఎవడిని గోకితే మాకేంటి? మేం తొక్కేది ఉంటే డైరెక్ట్ తొక్కుతాం. పోలీసులను అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? కేటీఆర్ జోకులు వేస్తున్నాడు. రేవంత్‌కు కేసీఆర్‌కు క్రేజ్ ఉంది. కేటీఆర్, హరీష్‌లకు క్రేజ్ ఉండడం ఏంటి? కేసీఆర్ ఉన్నన్ని రోజులే కేటీఆర్, హరీష్ రావుకు ఉనికి ఉంటుంది. అసెంబ్లీలో రేవంత్ ఉంటాడు కాబట్టే కేసీఆర్ రావడానికి భయపడుతున్నారు. అసెంబ్లీ పెట్టమని ప్రతిపక్షం డిమాండ్ చేస్తది. ప్రభుత్వం అసెంబ్లీ పెడుతామంటే ప్రతిపక్షం భయపడుతుంది. హరీష్ అంత యాక్టింగ్ మాకు రాదు. ఉత్తమ్ యాక్టర్ కాదు... ఫైటర్. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీష్ చేసింది మామూలు ఓవర్ యాక్షన్ కాదు. హరీష్, కేటీఆర్, బండి సంజయ్ అచానక్ లీడర్లు’ అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్ చేశారు.
ఏపీ మంత్రిపై..
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగం అయ్యి బనకచర్ల గురించి మాట్లాడినట్లున్నారన్నారు. ఫస్ట్ టైం మంత్రి కాబట్టి అవగాహన లేకుండా ఎజెండాలో లేని అంశాన్ని మాట్లాడారని తెలిపారు. జలశక్తి శాఖ ప్రకటనలో బనకచర్ల అంశం లేనేలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదు: నారాయణ
హెచ్‌సీఏ అక్రమాలు.. రంగంలోకి ఈడీ
Read latest Telangana News And Telugu News