Jagadish Reddy VS Kavitha: కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:29 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

సూర్యాపేట: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha)కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని విమర్శించారు జగదీశ్ రెడ్డి. కేసీఆర్ శత్రువులు ఉపయోగించిన పదాలను కవిత వల్లె వేస్తున్నారని ఆక్షేపించారు. ఇవాళ(ఆదివారం) సూర్యాపేటలోని తన కార్యాలయంలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నల్గొండ జిల్లాలో 25 ఏళ్లల్లో జరిగిన ఉద్యమాలు, గెలుపునకు తాను బాధ్యుడను అయితే ఓటమికి కూడా తానే బాధ్యుడనని.. పార్టీ అంతిమంగా ఫైనల్ అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. కొంతమంది ఏదో చేయాలని ఊహించుకుంటున్నారని విమర్శించారు. తాను పార్టీకి సైనికుడునని ఉద్ఘాటించారు. కేసీఆర్‌ను ఈ మధ్య కాలంలో తాను 50సార్లు కలిశానని గుర్తుచేశారు. కవిత గురించి మాట్లాడటం వృథా అని విమర్శించారు.
కేసీఆర్‌తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైనే చర్చించామని క్లారిటీ ఇచ్చారు జగదీశ్ రెడ్డి. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేమని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. తాను చావు తప్పి కన్నులొట్ట బోయినట్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. కానీ కొంతమంది గెలవలేదు కదా? అని ప్రశ్నించారు. కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు. తన దృష్టికి వచ్చి ఉంటే స్పందించేవాడినని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు
ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?
Read latest Telangana News And Telugu News