Cyber Scam: హైదరాబాద్‌లో అతిపెద్ద సైబర్ మోసం.. స్టాక్ బ్రోకింగ్ పేరిట టోకరా
ABN , Publish Date - Jul 14 , 2025 | 10:29 AM
స్టాక్ బ్రోకింగ్ పేరిట మహిళా వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

హైదరాబాద్: స్టాక్ మార్కెట్‌లో (Stock Market) పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని సామాన్య ప్రజలకు ఆశ చూపించి సైబర్ కేటుగాళ్లు (Cyber Criminals) బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ల (Investment Scheme) పేరుతో ప్రచారం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లని ఇందుకు వేదికలుగా మార్చుకుని చెలరేగిపోతున్నారు. బాధితులను భారీగా మోసం చేస్తోండటంతో లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారిని సైబర్ క్రిమినల్స్ స్టాక్ బ్రోకింగ్ (Stock Broking) పేరిట ఘరానా మోసం చేశారు. సదరు మహిళా వ్యాపారి నుంచి రూ. 3.2 కోట్లు కాజేశారు. మే 28వ తేదీన వాట్సాప్‌లో ఓ లింకును సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో మహిళ వ్యాపారి జాయిన్ అయ్యారు. షేర్ ట్రేడింగ్ విషయాలని సైబర్ కేటుగాళ్లు పంపడంతో బాధితురాలు పెట్టుబడి పెట్టారు. మే 30వ తేదీ నుంచి జులై 9వ తేదీ వరకు రూ.3.24 కోట్లను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలోకి బాధితురాలు పంపించారు.
ఆ తర్వాత ఆ షేర్ల విలువ రూ.30 కోట్లు చేరినట్లు సైబర్ కేటుగాళ్లు బాధితురాలి ఖాతాలో చూయించారు. జూన్ 20వ తేదీన రూ.5 లక్షలను బ్యాంకు ఖాతా నుంచి సదరు బాధితురాలు తీసుకున్నారు. మరోసారి పైసలను తీసుకోవడానికి మహిళా వ్యాపారి ప్రయత్నించగా డబ్బులు రాలేదు. వారిని కాంటాక్ట్ చేయడానికి ఆమె ప్రయత్నించారు. కేటుగాళ్ల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళా వ్యాపారి వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సైబర్ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని.. మొదట భారీ స్థాయిలో డబ్బులు వస్తాయని ఆశ పెడతారని.. ఆ తర్వాత మన దగ్గర ఉన్న పైసలను కాజేస్తారని పోలీసులు చెప్పారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్నకేటుగాళ్లని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..
నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి
Read Latest Telangana News And Telugu News