Hyderabad Cybercrime: వృద్ధురాలిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. కోటికి పైగా..
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:31 AM
బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల ఆకాష్ చౌదరి పేరిట ఫోన్ కాల్ వచ్చింది. 187 మంది చిన్నపిల్లల అక్రమ రవాణా, హత్య కేసులు వృద్ధురాలిపై ఉన్నాయని సైబర్ నేరగాడు భయపెట్టాడు. తనని అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నట్టు వృద్ధురాలిని ప్రలోభ పరిచాడు.
హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్న నేరాలు మాత్రం ఆగడం లేదు. దుండగులు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని రోజుకో కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతూ.. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేరాలు అన్ని ఇంటర్నెట్ ద్వారా చేయబడేవి కాబట్టి తమను ఎవరు పట్టుకోలేరు అనే ధీమాతో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన ఓ వృద్ధురాలి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలి నుంచి కేటుగాళ్లు కోటిన్నర కొట్టేశారు.
వివరాళ్లోకి వెళ్తే.. బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల ఆకాష్ చౌదరి పేరిట ఫోన్ కాల్ వచ్చింది. 187 మంది చిన్నపిల్లల అక్రమ రవాణా, హత్య కేసులు వృద్ధురాలిపై ఉన్నాయని సైబర్ నేరగాడు భయపెట్టాడు. తనని అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నట్టు వృద్ధురాలిని ప్రలోభ పరిచాడు. దీంతో భయపడిన వృద్ధురాలు ఆ కేసులతో తనకు ఇలాంటి సంబంధం లేదని ప్రాధేయపడింది. అనంతరం తమకు సహకరిస్తే కేసు నుంచి బయటపడేస్తామని దుండగుడు నమ్మబలికారు.
వృద్ధురాలిని నమ్మించడానికి కేటుగాడు పోలీస్ దుస్తులతో వీడియో కాల్ మాట్లాడాడు. అరెస్ట్ వారెంట్ ఉందని డిజిటల్ అరెస్ట్ చేస్తామని ఇంట్లోనే వృద్ధురాలిని బంధించాడు. దీంతో బయపడిన వృద్ధురాలు.. సైబర్ నేరగాళ్ల సూచనతో కోటిన్నర రూపాయలు వారికి ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Kurnool Fire Accident: కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
Minister Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి చర్యలు