Food Safety Officials On inspections: ప్యాకెట్ మసాలాలు వాడుతున్నారా? భయంకరమైన నిజం మీకోసం..!
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:10 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మసాలా తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. 30కి పైగా మసాలా మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్ సెంటర్స్‌పై సోదాలు చేశారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
హైదరాబాద్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మసాలా తయారీ కేంద్రాల్లో (Masala Factory) ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officials) ఇవాళ(మంగళవారం) తనిఖీలు చేశారు. 30కి పైగా మసాలా మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్ సెంటర్స్‌పై సోదాలు చేశారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో చిల్లీ పౌడర్ (Chili Powder), పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాలు సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని శ్రీవారి స్పైసెస్, బండ్లగూడ జాగీరులోని డివైన్ స్పైసెస్‌లు అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుక మలం ఉన్నట్లు గుర్తించారు. అవే మసాలాలు ప్యాకింగ్ చేసి షాప్స్‌కి పంపుతున్నారు నిర్వాహకులు. గడువు ముగిసిన, లేబుల్ లేని ప్రొడక్ట్స్ స్టోర్ చేసినట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రుల మధ్య విభేదాలు.. స్పందించిన మంత్రి ఉత్తమ్
సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్
Read Latest Telangana News And Telugu News