Medchal Fire Accident: మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 07:51 AM
Medchal Fire Accident: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు జరుగు తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్ని ప్రమాదాలు జరుగుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ(మంగళవారం) ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కేకేసీ ఎలక్ట్రికల్స్ అనే ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో చుట్టూ పక్కల పొగలు అలుముకున్నాయి. పొగలు దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులను భద్రత పరంగా సంఘటన స్థలం నుంచి పోలీసులు దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ACB Trap: ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట ఎస్సై
Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు
High Court: సీఎంపై వ్యాఖ్యలు..కేటీఆర్‌పై కేసును కొట్టేసిన హైకోర్టు
Read Latest Telangana News And Telugu News