Police Raid: ఉప్పల్‌లోని ఓ ఇంట్లో డ్రగ్స్
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:10 AM
ఉప్పల్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్‌ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు.

అధికారుల దాడులు.. స్వాధీనం
ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు
హైదరాబాద్ సిటీ. ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్‌ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన సందీప్, భరత్, రిషబ్‌శెట్టిలు స్నేహితులు. వీరు ముఠాగా ఏర్పడ్డారు. సందీప్ ఢిల్లీ నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను గుట్టుగా హైదరాబాద్‌కు రవాణా చేసేవాడు.
ఉప్పల్‌లో ఉంటున్న భరత్, రిషబ్‌షెట్టిలు నగరంలోని కస్టమర్స్‌కు రహస్యంగా విక్రయించి సొమ్ము చేసుకునేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ చంద్ర, సిబ్బంది అఖిల్, వెంకటేశ్వర్లు సహా.. తన టీమ్‌తో కలిసి ఉప్పల్ పరిధిలో ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ ఎండీఎంఏ డ్రగ్, గంజాయి కలిగి ఉన్న భరత్, రిషబ్‌షెట్టిలను అరెస్టు చేశారు. వారి నుంచి 13.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 513 గ్రాముల గంజాయి స్వాధీనం చేసున్నారు. నిందితులతో పాటు.. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను ఉప్పల్ ఎక్పైజ్ పోలీసులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు
కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News