Eagle Team: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు
ABN , Publish Date - Jul 18 , 2025 | 09:56 AM
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ( Malnadu Restaurant Drug Party Case) ఈగల్ టీం దూకుడుతో వెళ్తుంది. మూడు పబ్ యజమానులపైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఈ మేరకు పబ్ యజమానులకు ఈగల్ టీం నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో (Malnadu Restaurant Drug Party Case) ఈగల్ టీం (Eagle Team) దూకుడుతో వెళ్తుంది. మూడు పబ్ యజమానులపైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఈ మేరకు పబ్బు యజమానులకు ఈగల్ టీం నోటీసులు జారీ చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యకి ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించింది. మగ్గురు పబ్ యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం విచారణలో తేలింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈగల్ టీం చెబుతోంది.
వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపైన కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజాశేఖర, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు రెస్టారెంట్ సూర్య పేర్కొన్నారు. మరో నాలుగు పబ్ యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్ , బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్‌లు పార్టీలు ఇస్తున్నట్లు ఈగల్ టీం విచారణలో తేలింది.
కీలక విషయాలు వెలుగులోకి..
మల్నాడు డ్రగ్స్ కేస్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్ రావ్ కుమారుడు రాహుల్ తేజ్ ఫార్మ్ హౌస్‌లోనే డ్రగ్స్ పార్టీలు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ములుగులో రాహుల్ తేజ్‌కు ఫార్మ్ హౌస్ ఉందని విచారణలో తేలింది. కన్వేరా ఫార్మ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు చేస్తున్నారని ఈగల్ టీం చెప్పింది. ప్రతి వారం రాహుల్ తేజ్ ఫార్మ్ హౌస్‌లో సూర్య, డ్రగ్స్ పెడ్లర్లు కలుస్తున్నారని ఈగల్ టీం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఈ రాశి వారికి మార్పులు బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి
రష్యా, చైనాతో కూటమి పునరుద్ధరణకు ప్రయత్నాలు.. స్పందించిన భారత్
Read latest Telangana News And Telugu News