CV Anand:ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం ఆదేశాలు పాటిస్తాం
ABN , Publish Date - May 29 , 2025 | 05:35 PM
ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని, ఎన్ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే తప్పకుండా చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో సమీర్‌తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని వెల్లడించారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణ కొనసాగుతుందని, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని, ప్రస్తుతానికి ఉన్న చర్యలన్ని హోల్డింగ్‌లోకి వెళ్లిపోతాయని అన్నారు. కొత్త పాస్‌పోర్ట్ జారీ పక్రియ మొత్తం కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని తెలిపారు. పాస్‌పోర్ట్ ఎప్పుడు ఎలా జారీ చేస్తారనే విషయాన్ని తాము కూడా తెలుసుకోవాలని ఇంటర్‌పోల్, డిస్పోర్ట్ ఇతర చర్యలు అన్ని కూడా హోల్డింగ్‌లోకి పోతాయని చెప్పారు సీవీ ఆనంద్.
హైదరాబాద్ జోనల్‌లో నూతనంగా సైబర్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నిన్నటి వరకు కమిషనరేట్‌కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఉండేదని చెప్పారు. నేటి నుంచి జోన్ల వారిగా సైబర్ పోలీస్ స్టేషన్‌లు అమల్లోకి రానున్నాయని అన్నారు. నగరవ్యాప్తంగా రోజురోజుకూ సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. జోన్ల వారిగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లను ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 3గంటలకు సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. బాధితులకు వేగంగా సేవలు అందించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో సీవీ ఆనంద్ మాట్లాడారు.
జోనల్ సైబర్ సెల్స్ ఏర్పాటు
జోనల్ సైబర్ సెల్స్‌ను(ZCC) జీఓ 50ద్వారా ఏర్పాటు చేశామని.. హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉందని సీవీ ఆనంద్ వెల్లడించారు. సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి పిటిషన్‌ని దర్యాప్తు చేయడానికే జడ్‌సీసీ సిస్టమ్ తీసుకువచ్చామని ప్రకటించారు. 2015లో 351కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. గత సంవత్సరం 3111 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 35రకాల కేసులు నమోదవుతున్నాయని.. వాటిన్నింటిని గుర్తించామని అన్నారు. భాగ్యనగరంలో సోషల్ మీడియా కేసులు ఎక్కువయ్యాయని.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7జోన్లల్లో జడ్‌సీసీని తీసుకువచ్చామని అన్నారు. జడ్‌సీసీ పని తీరు, పని భారం దృష్ట్యా సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటవుతాయని తెలిపారు. ప్రతి స్టేషన్‌లో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వీలుకాదని.. డీసీసీ కార్యాలయాల్లో జోనల్ డీసీపీ పర్యవేక్షణలో ఇవి నడుస్తాయని చెప్పుకొచ్చారు. ప్రతి జోన్లు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. జడ్‌సీసీ కోసం ఒక్క ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోం గర్డ్స్ ఉంటారని అన్నారు. జడ్‌సీసీలోనే వృత్తిరీత్యా అంత టెక్నికల్ పరిజ్ఞానం పొందిన తర్వాతే సిబ్బందిని కేటాయించామని స్పష్టం చేశారు. జడ్‌సీసీలోనే లక్ష కేసుల వరకు దర్యాప్తు చేయనున్నారని అన్నారు. 25వేల కంటే తక్కువ ఉంటే లీగల్ ప్రాసెస్ ప్రకారం వెళ్తారని తెలిపారు సీవీ ఆనంద్.
హైదరాబాద్‌లో NIA సోదాలు
ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ (NIA) దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు సీవీ ఆనంద్. హైదరాబాద్‌లో ఎన్ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని, ఎన్ఐఏ (NIA) విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే తప్పకుండా చేస్తామని అన్నారు.హైదరాబాద్‌లో సమీర్‌తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్న నైజేరియన్స్‌ను డిపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలామంది నకిలీ పాస్ పోర్ట్‌లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కూడా అరెస్టు చేస్తున్నామన్నారు. నైజీరియన్లను వాళ్ల దేశానికి డిపోర్ట్ చేస్తారనే భయంతో నైజీరియన్లు ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. నైజిరియన్స్‌పై కేసు నమోదైతే చట్టపరంగా డిపోర్ట్ చేయలేమని అన్నారు. వారిపై కేసు ట్రయల్ పూర్తి చేసి పూర్తి అయ్యే వరకు డిపోర్టు చేయలేమని చెప్పారు. బంగ్లాదేశ్‌కి చెందిన పౌరులు శరణార్ధులగా ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అడ్డదారుల్లో వారు ఇక్కడ ఆధార్ పొందుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యవహారంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News