MP Mallu Ravi: బీఆర్ఎస్ రప్పా రప్పా డైలాగులు.. కాంగ్రెస్ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:00 PM
బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పా రప్పా డైలాగులపై ఆయన స్పందించారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవని మల్లు రవి అన్నారు.

హైదరాబాద్: పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో రైతులు నిన్న(శనివారం) ధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మానిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది రప్పా.. రప్పా ప్లకార్డులు ప్రదర్శించారు. 2028లో రప్పా..రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులతో గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు. అయితే రప్పా రప్పా డైలాగులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి (Congress MP Mallu Ravi) స్పందించారు.
సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవని అన్నారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ డైలాగులు వినడానికి బాగుంటాయి... కానీ రాజకీయాల్లో చెల్లవని హెచ్చరించారు. రాజుల కాలంలో రప్పా రప్పా ఆడించేది ఉండేదని అన్నారు. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యమని... ఇక్కడ రప్పా రప్పా అంటే చెల్లదని వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని అన్నారు మల్లు రవి.
బీఆర్ఎస్ పరిస్థితి లోకల్ బాడీ ఎన్నికల్లో తేలుతుందని మల్లు రవి చెప్పారు. బీఆర్ఎస్ వంటి పార్టీలకు కాంగ్రెస్ భయపడదని హెచ్చరించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని అన్నారు. టీ కాంగ్రెస్ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌లను అడిగి సమస్య తెలుసుకుంటానని చెప్పారు. ఆ సమస్యలను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తానని తెలిపారు. వరంగల్, గజ్వేల్ రెండు ప్రాంతాల నుంచి హై కమాండ్‌కి ఫిర్యాదులు వచ్చాయని... వాటిపై పరిశీలన చేస్తామని మల్లు రవి పేర్కొన్నారు.
మీనాక్షి నటరాజన్‌తో మల్లు రవి భేటీ
మీనాక్షి నటరాజన్‌తో మల్లు రవి ఆదివారం భేటీ అయ్యారు. ఈనెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు గాంధీ భవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని నిర్వహించాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. పలు నియోజక వర్గాల్లో క్రమశిక్షణ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులపై మీనాక్షీతో మల్లు రవి చర్చించారు.
రప్పా.. రప్పా ప్లకార్డులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం...
బీఆర్ఎస్ కార్యకర్తల రప్పా.. రప్పా ప్లకార్డులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా సంక్షేమం అమలు చేస్తున్నందుకా రప్పా.. రప్పా అని ప్రశ్నించారు. రైతు భరోసా నిధులు వేస్తున్నందుకా రప్పా.. రప్పా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
For Telangana News And Telugu News