Share News

Fire Accident: మేడ్చల్ జిల్లాలో ఘోరం.. కారు డ్రైవర్ సజీవ దహనం

ABN , Publish Date - Nov 24 , 2025 | 07:54 AM

శామీర్‌పేట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Fire Accident: మేడ్చల్ జిల్లాలో ఘోరం.. కారు డ్రైవర్ సజీవ దహనం
Fire Accident in Shamirpet

మేడ్చల్ జిల్లా, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అగ్నిప్రమాదాలు (Fire Accident) పెరిగిపోతున్నాయి. వరుస అగ్నిప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శామీర్‌పేట్ పీఎస్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ఓ కారులో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ మంటల్లో సజీవ దహనమయ్యాడు కారు డ్రైవర్. కారును రింగ్ రోడ్డు పక్కన ఆపి ఏసీ వేసుకొని డ్రైవర్ నిద్రిస్తున్న సమయంలో మంటలు వ్యాపించినట్లు సమాచారం.


శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓ ఆర్‌ఆర్‌పై ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు పెట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూలీలకు గాయాలు...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దమ్మన్నపేట శివారులో కూలీలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 50 మందితో ఒకే వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రేగొండ మండలం దమ్మన్నపేట నుంచి జూకల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని కూలీలు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 24 , 2025 | 11:13 AM