BRS MP Suresh Reddy: నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి
ABN , Publish Date - Nov 30 , 2025 | 03:51 PM
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరారు.
ఢిల్లీ, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలకు వచ్చే నిధుల వాటాపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి (BRS MP Suresh Reddy) సూచించారు. ఇవాళ(ఆదివారం) ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని తాము డిమాండ్ చేశామని అన్నారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా తక్కువ సహాయం అందిందని తెలిపారు.
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరారు. రాష్ట్రం నుంచి కేంద్రం రూపాయి తీసుకుంటే 48 పైసలు మాత్రమే తిరిగి రాష్ట్ర అభివృద్ధికి వస్తోందని..ఇది సరికాదని పేర్కొన్నారు ఎంపీ సురేశ్‌రెడ్డి.
అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని సూచించారు. డిలిమిటేషన్ వల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గే అవకాశం ఉందని..దీనిపై ప్రజల్లో ఆందోళన ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల పెండింగ్ అంశాలు, డిమాండ్లను పార్లమెంట్‌లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని అన్నారు. ‘సర్’పై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు ఏ ఓటరును ఓటర్ జాబితా నుంచి అనైతికంగా తొలగించకూడదని సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పుకొచ్చారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని.. ఈ విషయంపై కూడా పార్లమెంటులో తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంగిస్తున్నారు.. కవిత ఫైర్
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
Read Latest TG News and National News