Film Celebrities: బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:40 PM
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.

హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో (Betting App Case) ఈడీ అధికారులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న సినీ సెలబ్రిటీలకు (Film Celebrities) ఇవాళ(సోమవారం) నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీప్రసన్న విచారణకి హాజరవ్వాలని నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. జులై 23న దగ్గుబాటి రానా, జులై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మీప్రసన్నను విచారణకి హాజరవ్వాలని నోటీసులో తెలిపారు. విదేశీ బెట్టింగ్ యాప్‌లను వీరు ప్రమోట్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీప్రసన్నని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రిటీలకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ల (FIR) ఆధారంగా ఈడీ అధికారులు ECIR (Enforcement Case Information Report) నమోదు చేశారు. సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులు, పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎంతోమంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈడీ అధికారులు, పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
Read latest Telangana News And Telugu News