Home » ED Notice
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల మీద, నాలుగు కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్) నమోదు చేశారు.
కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.
కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది.
అగ్రిగోల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదులందాయి. దాంతో గతేడాది జూన్‌లో ఈడీ రంగంలోకి దిగి మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలు హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.