Share News

Enforcement Directorate : ఎల్లుండి విచారణకురండి!

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:13 AM

కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.

Enforcement Directorate : ఎల్లుండి విచారణకురండి!

  • కాకినాడ సీపోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయికి మళ్లీ ఈడీ నోటీసులు

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే ఈడీ ఒకసారి ఆయనకు నోటీసు ఇచ్చింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయన్న కారణం చూపి విజయసాయి అప్పట్లో విచారణకు హాజరుకాలేదు. తాజాగా మరోసారి ఆయనకు నోటీసులు అందినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో మనీలాండరింగ్‌ అక్రమాలు జరిగినట్టు ఈడీ ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి, ‘అరబిందో’ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు రాలేని విక్రాంత్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. సీపోర్టులో తన వాటాలను బెదిరించి లాక్కున్నారని కేవీరావు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ బలవంతపు ‘డీల్‌’లో విజయ సాయిరెడ్డి, విక్రాంత్‌ రెడ్డిదే కీలక పాత్ర! ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు గుర్తించడంతో విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.

Updated Date - Jan 04 , 2025 | 04:15 AM